Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుంగతుర్తి
దేశంలోనే విద్యాభివద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం నిరంతరం కషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో రూ.12 లక్షలతో పట్టాభి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మండపం పనులకు ,26లక్షలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. విద్యాభివద్ధికి ఆర్థిక బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గురుకులాలు ,కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ప్రారంభించి ,ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం మండలంలోని దేవుని గుట్టతండా గ్రామపంచాయతీలో రూ.పది లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. రామన్నగూడెం ఎంపీటీసీ నరేష్ వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు ,ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు,వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ యాదగిరి గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, తునికి సాయిలు,భాషబోయిన వెంకన్న, గ్రంథాలయ చైర్మెన్ గోపగాని రమేష్ గౌడ్,జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాశాఖ అధికారి లింగయ్య, తుంగతుర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండగడుపుల యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.