Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పిస్తూ, పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేంద్ర బడ్జెట్ప్రతులను సీపీఐ(ఎం) మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా వద్ద దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ.ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ ,నాయకులు సుధగాని సత్య రాజయ్య ,వడ్డేమాన్ శ్రీనివాసులు ,నల్ల మాస తులసయ్య, జూకంటి పౌలు ,మోరిగాడి అజరు, పిక్క గణేష్ ,వడ్డేమాను విప్లవ్ ,చెక్క పరుశరాములు, మోరీగాడి లక్ష్మణ్ ,కూరెల్ల రవి ,దండు నాగరాజు, కంసానీ సురేష్, బండ శ్రీను, చంద్రయ్య పాల్గొన్నారు.