Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏ అంశంలో చూసినా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ
అ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
బీజేపీ ఫేక్ వాట్సాప్ ప్రచారం చేస్తుందని టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. గురువారం ఆలేరు నియోజకవర్గ స్థాయి యువజన విద్యార్థి సోషల్ మీడియా విభాగం సమావేశం గుట్టలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ అంశంలో చూసినా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబరవన్ స్థానంలో ఉందన్నారు. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో కొనసాగుతుందని తెలిపారు.డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకునే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉందని విమర్శించారు. తెలంగాణలో బండి, గుండు మాటలు చెప్పమంటే కోటలు దాటుతాయని తాము అడ్డుకుంటే ఒక్కరూ కూడా బయట తిరగ లేరని హెచ్చరించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటుంటే ఏడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంటున్నారని దుయ్యబట్టారు. కనీసం ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అవి కాకుండా రైల్వే బ్యాంకు డిఫెన్స్‌లో కలిపి 15 లక్షల ఉద్యోగాలు నింపాలని ఢిల్లీలో బండి సంజరు దమ్ముంటే మిలియన్ మార్చ్ చేయాలని సూచించారు. రాజ్యాంగం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం తప్పు మాట్లాడారన్నారు. అంబేద్కర్ గారే తను రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, అవసరమయితే రద్దు చేయాలని చెప్పాడని తెలిపారు. దేశంలో రాజ్యాంగ స్ఫూర్తి పోతుందని న్యాయం చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అంటేనే కోతలని,కోతలు తప్ప ఏం పని జరగడం లేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాగానే వాతలుపెడతారని హెచ్చరించారు.పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.బడ్జెట్లో తెలంగాణకు మొండి చెయ్యి చూపారని విమర్శించారు .ముల్లును ముల్లుతోనే తీయాలని అంతకంటే గట్టి సమాధానం చెప్పాలని, తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు ఈ సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డ్డి ,డీసీసీబీ చైర్మెన్‌్ గోంగిడి మహేందర్‌రెడ్డ్డి టీిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకష్ణా రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య, యువజన విద్యార్థి విభాగం నేతలు ఎండి.అజ్జు, భీమగాని నరసింహ, ముఖ్యర్ల సతీష్ యాదవ్ , నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.