Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుంగతుర్తి
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సూచించారు. గురువారం మండల పరిధిలోని వెంపటి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. కోవిడ్ నిబంధనల గురించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతే శ్రీనివాస్, ఉపాధ్యాయ బందం కరుణాకర్ ,సురేందర్, బాలయ్య, రవీందర్, పీఈటీ సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.