Authorization
Fri March 21, 2025 12:34:27 am
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రోడ్డుపక్కన గర్భిణి ప్రసవమైన సంఘటన గురువారం మండలంలోని హన్మపూర్ గ్రామం వద్ద చోటు చేసుకుంది. పేషెంట్ బందువులు తెలిపిన ప్రకారం...వివరాల్లోకి వెళితే.. నీతూ అనే గర్భిణీ మహిళాకు పురిటి నొప్పులు రావడం తో భువనగిరి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.గజ్వేల్‌కు చెందిన నీతు, బంధువులు యాదగిరిగుట్ట దేవాలయానికి దర్శనాకి అని వెళ్లి తిరుగు ప్రయాణం ఆటోలో వెళ్తున్నారు. భువనగరి మండలం హన్మపూర్ గ్రామం రాముల వారి దేవాలయం వద్దకు దగ్గరకు రాగానే నొప్పులు రావడంతో రోడ్డు పక్కన ఆపారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం వచ్చారు. అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకునే సమయానికి గర్భిణీ ప్రసవమైంది. మూడవ కానుపు లో పండంటి ఆడ బిడ్డకు జన్మ నిచ్చింది. ఈఎంటి వాణి ,పైలట్ మహేష్ అక్కడే ప్రథమ చికిత్స అందించి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. తల్లీచ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.