Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తిరుమలగిరి
మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బాసరలో చదువుతున్న త్రిబుల్ ఐటీ ఫైనలియర్ విద్యార్థి దురుసోజు యాకేష్ (21) బ్రెయిన్ డెడ్‌తో బుధవారం మతి చెందాడు. మహేష్ తల్లిదండ్రులు దురుసోజు ఉప్పలయ్య జ్యోతి తన కొడుకుకు నలతగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కదలలేని స్థితికి చేరుకున్న యాకేష్కు డాక్టర్లు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి రక్తం గడ్డ కట్టి బ్రెయిన్‌డెడ్ అయింది అని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎలాగూ చనిపోతాడని తెలిసి పుట్టెడు దుఃఖం లో ఉండి కూడా కొడుకు అవయవాలను ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఆలోచనతో జీవన్దాన్్ ట్రస్టుకు రెండు కిడ్నీలు కళ్ళు లివర్ గుండెను దానం చేసి తల్లిదండ్రులు వారి దాతత్వాన్ని చాటుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ వారి నివాసానికి వచ్చి యాకేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్ రాజశేఖర్, మండల అధ్యక్షులు రఘునందన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తిరుమణి యాదగిరి, కౌన్సిలర్లు బత్తుల శీను నరోత్తం రెడ్డి, పత్తేపురం సరిత, మరియు నాయకులు కందుకూరి లక్ష్మయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.