Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని, ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై కొండల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన షెక్ అన్వర్ (22) నేరేడుచర్ల పట్టణంలోని ఒక ట్రాక్టర్ మెకానిక్ షెడ్లోని మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అన్వర్ ప్రతిరోజు తన మోటార్ సైకిల్ పై నేరేడుచర్ల పనికి వెళ్తూ వస్తూ ఉండేవాడు.ఆ మోటార్ సైకిల్ పాతది కావడంతో తరచూ రిపేర్ పెడుతుందని తనకు కొత్త మోటారు సైకిల్ కావాలని తండ్రి మౌలానాను అడగ్గా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదని, కొంతకాలం తర్వాత కొనిస్తానని చెప్పాడు. తండ్రిపై ఆర్థిక భారం పెట్టొద్దనే ఉద్దేశంతో తన మోటార్ సైకిల్ లోని పెట్రోల్ తీసుకొని బుధవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఒంటిపై పెట్రోలు పోసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి ఇంట్లోనే తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే నిప్పంటించుకొని కాలిపోయాడు. వెంటనే ఆ్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మతుడి తండ్రి షెక్.మౌలానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని హుజుర్నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు తెలిపారు .