Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-సూర్యాపేట
రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యానించిన కేసీఆర్ తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందుత్వ ఎజెండాయే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయన్నారు. వారిని బలపర్చే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిన ఉద్దేశంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత జాతికి క్షమాపణ చెప్పాలని అన్నారు.ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, నాయకులు వెంకటేశ్వర్లు,ఏసు,నర్సయ్య,రాములు తదితరులు పాల్గొన్నారు.