Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ -అర్వపల్లి
ప్రభుత్వంఅమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి అడ పిల్లలకు గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు .మండల కేంద్రంలో ని శ్రీ రామ ఫంక్షన్ హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 54 మంది లబ్ధిదారులకు రూ.5406264 అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ .పేద ప్రజల గురించి ఆలోచించే గొప్ప మనసున్న వ్యక్తి అని సీఎం కేసీఆర్ అని అన్నారు , ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుండగాని సోమేష్ గౌడ్ ఎంపీపీ మనె రేణుక జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, తహసీల్దార్ యాదగిరి రెడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు ఎంపీటీసీలు పాల్గొన్నారు