Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ-కేతేపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మండలంలోని ఇనుపాముల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన బత్తుల సత్యనారాయణ రెడ్డి, కానుగు యాదగిరి ఆధ్వర్యంలో 80 కుటుంబాలు గురువారం నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాల వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ చిత్తలూరు గోపాల్ , టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెమట వెంకన్న యాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొప్పుల ప్రదీప్ రెడ్డి, టీఆర్ ఎస్వీ మండల అధ్యక్షులు వంటల చేతన్ కుమార్, మండల ఉపాధ్యక్షులు బొజ్జ అరవిందు, గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల రాగ్ని, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.