Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రాజ్యాంగాన్ని మార్చాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు వివాదాస్పదమవు తున్నాయని,దీనిపై తక్షణమే సీఎం ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకత్వం మతోన్మాద ధోరణులను, నియంతత్వ విధానాలను విమర్శిస్తూ కేసీిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా అని, రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రజలకు నిర్ధిష్టంగా చెప్పాలన్నారు. ి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నది కేంద్రంలో వున్న మోడీ సర్కార్ అని విమర్శించారు. రాజ్యాంగం మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం,సమాఖ్య వ్యవస్థ లౌకిక విలువల మీదనే బీజేపీ దాడి చేస్తున్నదన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం స్వాతంత్య్రోద్యమ వారసత్వంగా వచ్చిందన్నారు. జాతీయోద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని ఈ మతోన్మాద శక్తులు, అంబేద్కర్ పేరు వాడుకుంటూ,రాజ్యాంగ విలువలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలకు కేసీఆర్ వివరణ ఇచ్చి ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని, అపోహలను తొలగించాలని డిమాండ్ చేశారు.