Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ తండాలో గురువారం సర్పంచ్ సింగం ఆంజనేయులుతో కలిసి తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి చౌక ధరల (రేషన్ షాపు) ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రేషన్ బియ్యం తీసుకోవడానికి లక్ష్మాపూర్ వెళ్లాలంటే ఇబ్బంది అక్కుతుందని ఉపకేంద్రం ఏర్పాటుకు చేయాలని మంత్రి మల్లారెడ్డికి విన్నవించామని చెప్పారు. ఆయన ప్రత్యేక చొరవతో కలెక్టర్ ఆదేశాల మేరకు రేషన్ బియ్యం తండా లో రేషన్ షాపు సబ్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు, ఉప సర్పంచ్ వైద్యనాథ్, వార్డు సభ్యులు సురేష్, బుజ్జి,రేషన్ డీలర్ సింగం క్రిష్ణ, గ్రామ పెద్దలు లక్ష్మణ్, హీరాలల్, వెంకటేష్, శంకర్, రూకమ్మ, తదితరులు పాల్గొన్నారు.