Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట:పెరుగుతున్న స్టీలు, సిమెంటు, ఇసుక ధరలతో ఇంటి నిర్మాణాలు ఆగిపోయి కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, పెంచిన స్టీలు, సిమెంటు, ఇసుక ధరలు తగ్గించి కార్మికులకు పనులు కల్పించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా అధ్యక్షుడు గోరిగె సోములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయు కార్యాలయంలో శుక్రవారం సంఘం పట్టణ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్రం ఏర్పడ్డాక సంక్షేమ బోర్డు సలహా మండలిని ఏర్పాటు చేయలేదన్నారు. నిర్మాణ కార్మికుల కష్టార్జితంతో బోర్డులో పోగవుతున్న డబ్బులను ప్రభుత్వం దుబారా ఖర్చు చేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగా పెన్షన్, పిల్లలకు స్కాలర్ షిప్స్, ఇండ్ల రుణాలు, పనిముట్లు కొనుక్కోవడానికి వ్యక్తిగత రుణాలు రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు. లేబర్ డిపార్ట్మెంట్ లో ఏళ్ళ తరబడిగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టన అధ్యక్ష కార్యదర్శులు, గొల్లూరు నాగరాజు, గోరిగె ఆది మల్లయ్య, గోరిగె మల్లయ్య, నకిరేకంటి శంకర్, ప్రసాద్, రమెష్, సైదులు, గణేశ, వెంకటరెడ్డి, రామకష్ణ, దుర్గరావు, కొండల్, రాజు తదితరులు పాల్గొన్నారు.