Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రాష్ట్రంలో గొర్రెల బీమా పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి వర్తక సంఘంలో జీఎంపీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం దయ్యాల నర్వింహ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మండలపై వీధికుక్కల దాడిలో వందలాది గోర్రెలు చనిపోయి పెంపకందారులు లక్షలాది రూపాయల ఆర్థిక నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గొల్ల, కర్మ, గొల్ల కూర్మ వత్తిదారుల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదన్నారు. జీవాల పెంపకందారులు పూర్తిగా వైద్యం ప్రైవేటు మెడికల్ షాపులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. పశువైద్యశాలల్లో జీవాలకు సరిపడా మందులు లేవని, ఖాళీగా వున్న సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ బండారు నర్సింహ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దే పురం రాజు, జిల్లా నాయకులు బుడమా శ్రీశైలం, సత్యనారాయణ, బుడమ శ్రీశైలం,, కడారి రాజమల్లు, మద్ద్మెరం బాల నర్సింహ, నార్ల గొండ నర్సింహ్మ, గంగాదేవి జంగయ్య యాదవ్, పాక జహంగీర్ లు పాల్గొన్నారు.