Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల పరిధిలోని చెరువుగట్టులో గల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 8వ తేదీ నుంచి 13 వరకు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలకు రావాలని ఆలయ పాలకమండలి చైర్మెన్ మేకల అరుణ రాజిరెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.మహేంద్ర కుమార్ శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డిని ఆహ్వానించారు. కార్యక్రమంలో దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు పసునూరి శ్రీనివాస్, రాధారపు భిక్షపతి, సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, ప్రధానార్చకులు పోతులపాటి రామలింగేశ్వర పాల్గొన్నారు.