Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మార్చి 28, 29న దేశవ్యాప్త
సార్వత్రిక సమ్మె
నవతెలంగాణ-నల్లగొండ
ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 28, 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించాలని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవోలను సవరించకుండా నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలకు నిరసనగా మార్చి 28, 29న దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్న పాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు డబ్బీకార్ మల్లేష్, శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల యాదయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, నర్సారెడ్డి, రొండి శ్రీనివాస్, అద్దంకి నర్సింహ, కానుగు లింగుస్వామి, యల్లయ్య, వెంకన్న, బొట్టు శివకుమార్, సుధాకర్ పాల్గొన్నారు.