Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వవిప్ సునీత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -ఆత్మకూర్ఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని దళితులు సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగాబలపడాలనిప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిఅన్నారు. మండలంలోని మొరిపిరాల గ్రామంలో రూ.25 లక్షల తో సీసీ రోడ్లకు ఆమె శుక్రవారం శంకుస్థాపన చేశారు. దళిత బంధును పథకాన్ని అందించేందుకు మండలంలోని మొరిపిరాల గ్రామం ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు, దళితబంధు లబ్దిదారుల ఎంపిక కోసం నేటి నుండి గ్రామంలో అధికారులు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కష్ణారెడ్డి ఎస్సీ కార్పొరేషన్ శ్యామ్ సదర్ ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ సర్పంచ్ సామ తిరుమల్ రెడ్డి తాసిల్దార్ జయమ్మ ఎంపీడీవో రాములు ఎం పీ ఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.