Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు, ఎస్.లింగోటం మాజీ సర్పంచ్ భీమిడి శంకరాజీ రెండో వర్థంతిని కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణకేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక అమ్మానాన్నా అనాధాశ్రమంలోని అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, నాయకులు ఉబ్బు వెంకటయ్య, బక్క శ్రీనాథ్, మొగుదాల రమేశ్‌గౌడ్, కొయ్యడ సైదులుగౌడ్, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, భీమిడి ప్రతీక్, ఉపేందర్జీ, సుర్వి నర్సింహాగౌడ్, సందగల్ల సతీశ్, ఆకుల ఇంద్రసేనారెడ్డి, చింతల సాయిలు, ఎర్ర విక్రమ్ పాల్గొన్నారు.