Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఉద్దీపన ఫౌండేషన్ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
అ వాలంటీర్లలకు వేతనాలు పంపిణీ
నవతెలంగాణ -రామన్నపేట
వచ్చే విద్యా సంవత్సరం నుండి నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్దీపన ఆధ్వర్యంలో విద్యావాలంటీర్లను నియమించి మెరుగైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందిస్తామని ఉద్దీపన ఫౌండేషన్ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండలంలోని దుబ్బాక గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉద్దీపన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యా వాలంటీర్లకు ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రరావు సమకూర్చిన నాలుగు నెలల వేతనాలను ఆయన ఇద్దరు వాలంటీర్లకు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బేతోజు భాస్కరాచార్య అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ సమయాన్ని, శక్తిని కేటాయించి శ్రద్ధతో ప్రాథమిక విద్యను అందించడం మూలంగా దుబ్బాక పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా ఎంపికైందన్నారు. రానున్న కాలంలో మరింత ఉత్తేజంగా పనిచేసి పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రణాళికతో కూడిన విద్యను అందించాలని కోరారు. కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం విద్యావలంటీర్లను నియమించలేదని తెలిపారు.ఎంపీటీసీ జ్యోతి రామచంద్రరావు విద్యా వాలంటీర్లకు వేతనాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. రానున్న మూడు నెలల కోసం ఒక విద్యావలంటీర్లను అందిస్తానని వారికి వేతనాలు కూడా సమకూరుస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చక్కటి ప్రణాళికను రూపొందించారన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఆంగ్ల మాధ్యమం బోధనను ప్రవేశ పెడుతున్నారని తద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని తెలిపారు. తాను ప్రవేశపెట్టిన ఉద్దీపన విద్యా కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వ అధికారులు అధ్యయనం చేస్తున్నారన్నారు. నాటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ టీమును, వాలంటీర్లను స్వయంగా పరిశీలించి అభినందించారని తెలిపారు. అనంతరం గ్రామంలో కరోనా బారిన పడిన మాజీ సర్పంచ్ గట్టు యాదయ్య కూతురును వారి ఇంటికి వెళ్లి కలసి పరామర్శించారు. అనంతరం మండల కేంద్రంలోని వంజరి వాడలో కాలేరు (గొట్టిపర్తి) శ్రీనివాస్ తల్లి మతి చెందగా వారిని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రరావు, టీిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు గంగుల వెంకట రాజా రెడ్డి, ఉప సర్పంచ్ గుండాల బిక్షం, ఉపాధ్యాయులు ఉయ్యాల బిక్షం, నాయకులు తుమ్మల జనార్దన్ రెడ్డి, మధుసూదన్ రావు, రచ్చ లక్ష్మణ్, జెల్ల వెంకటేష్, ఎండి అక్రమ్, గ్రామస్తులు తదితరులున్నారు.