Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్ రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించ గలిగితే నివారణ సాధ్యమేనని ఎంజీ యూ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాల యంలో సైన్స్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ మూడో విభాగం ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చాలా మందికి ఈ అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరిన తరువాత హాస్పిటల్స్‌కు వెళ్లి వైద్యం చేయించుకున్నా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. క్యాన్సర్ అనేది అనేక రకాలుగా ఉంటుందని, వాటిలో కొన్నింటిని వైద్యం చేసి నయం చేయించుకోవచ్చని పేర్కొన్నారు. మనుషులు జీవన విధానంలో వచ్చిన మార్పులతో అనేక రోగాలు సంక్రమిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి మాట్లాడుతూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ క్యాన్సర్లలో నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను మంచి ఆహారం, వ్యాయామం చేయడంతో నివారించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.వసంత, బయో టెక్నాలజీ హెడ్ డాక్టర్ శివరామ్, బయోకెమిస్ట్రీ హెడ్ డాక్టర్ రాంచందర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్ డాక్టర్ తిరుమల, అధ్యాపకులు డాక్టర్ ఆర్ రూపా, డాక్టర్ జ్యోతి పాల్గొన్నారు.