Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ఈ నెల 21,22 తేదీల్లో చౌటుప్పల్ పట్టణంలోని జయశ్రీ గార్డెన్స్ లో నిర్వహిం చనున్న ఎస్ఎఫ్ఐ జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం పట్టణకేంద్రంలోని పైలాన్ పార్కు వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షులు బత్తుల శంకర్, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం 1970లో ఏర్పడి అధ్యయనం, పోరాటం అనే నినాదంతో దేశంలోనే అగ్రగామి విద్యార్థి సంఘంగా పేరొందిందన్నారు. పోరాటాలే వేదికగా ఉద్యమాలు రూపొందించడంలో విద్యార్థులకు అండగా ఎస్ఎఫ్ఐ నిలుస్తుందన్నారు. ఈ మహాసభలకు విద్యావంతులు, మేధావులు, వ్యాపారస్తులు, శ్రేయోభిలాషులు ఆర్థికంగా, హార్థికంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం రాజు, బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకష్ణ, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి గంగదేవి సైదులు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు దండ అరుణ్‌కుమార్, అవ్వారు గోవర్థన్, పల్లె శివకుమార్, సామిడి నాగరాజురెడ్డి, ఎమ్‌డి.ఖాసీమ్, దొడ్డి గణేశ్ పాల్గొన్నారు.