Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఆలేరు నుండి మోత్కూర్ వెళ్లే బైపాస్ రహదారి సాయిగూడెం మీదుగా వెళ్తుంది. సాయిగూడెంలో అండర్ పాసు మంజూరు కావడంతో తారు రోడ్డు వేశారు కానీ డివైడర్లను వేయడం మరిచారు. ఈ రహదారిపై రోజు వందలాది వాహనాలు నడుస్తుంటాయి. సాయిగూడెం వద్ద డివైడర్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదం జరిగితే గానీ ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చెయ్యరా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డివైడర్లు, సూచికబోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.