Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీఎంహెచ్ఓ కొండలరావు
నవతెలంగాణ-నల్లగొండ
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికీ వ్యాయా మం అవసరమని డీఎంహెచ్ఓ కొండలరావు, ఐఎంఏ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ డాక్టర్ పుల్లారావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ ఫౌండేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కొప్పోలు రవివర్మ స్వేరో అధ్యక్షతన 100 మందితో 5 కె రన్ ను ప్రారంభించి మాట్లాడారు. ఈ రన్ నాగార్జున డిగ్రీ కాలేజ్ నుండి ప్రారంభమై క్లాక్ టవర్, ప్రకాశం బజార్, డి ఈఓ ఆఫీస్ మీదుగా బయల్దేరి ఎన్జీకాలేజీ కి చేరింది. క్యాన్సరే కాదు కరోనా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం, పౌష్టికాహారం ఒకటే మార్గం అన్నారు.ఫిట్ ఇండియా ఫౌండేషన్ అనేది ఆరోగ్య భారత్ నిర్మాణం దిశగా రన్ రీడ్ లీడ్ అనే నినాదంతో వంద సంవత్సరాలు ఏవిధంగా బతకాలో నేర్పిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్ ఇండియా ఫౌండేషన్ యాదాద్రి జోన్ ఉపాధ్యక్షుడు నగేష్, పీఈటీ శంభులింగం , ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు నరహరి, మల్లేష్ యాదవ్, ఎంజీ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ఎస్ఎస్యూ జిల్లా ప్రెసిడెంట్ సురేష్, పవన్, కపిల్ పాల్గొన్నారు.