Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
మున్సిపల్ చైర్మెన్, కమిషనర్ తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని మున్సిపల్ కార్మికుడు భగవాన్ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పెట్రోల్ డబ్బా వెంట తెచ్చుకున్న భగవాన్ ఆత్మహత్య పాల్పడుతుంటే అక్కడే ఉన్న ఇతరులు, పోలీసులు అతని చేతిలో ఉన్న డబ్బాను తీసి పడేశారు. దీంతో అక్కడికి పెద్దఎత్తున మీడియా చేరుకుంది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు ఫోర్త్ క్లాస్ సిబ్బందిపై,పారిశుధ్య కార్మికుల పై ముందునుండి వేధించేవారని, రెండో గ్రేడ్ మున్సిపాలిటీగా మారిన భువనగిరిలో విస్తీర్ణం పెరిగిందని , సరిపోను సిబ్బంది లేకున్నా ఉన్న సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నా చైర్మెన్ వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. తాను మున్సిపల్ కార్యాలయం యందు తాను విధులు నిర్వర్తిస్తే చైర్మెన్ కార్యాలయానికి రావొద్దని అంటున్నారని తెలిపారు. మాస్టర్ రోల్‌తో పాటు అనేక రకమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనను విధుల నుండి తొలగించాలని కమిషనర్ పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. గతంలో ఒక మహిళ కార్మికురాలు చైర్మెన్‌పై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టిందని అయినా మార్పు రాలేదని పేర్కొన్నారు.