Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-తిరుమలగిరి
గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ సామాజిక ఉద్యమంగా తీసుకొని సమన్వయంతో పనిచేసి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కషి చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.శుక్రవారం మండలకేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గంజాయి నిర్మూలన కోసం అవగా హనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజారు చాపకింద నీరు లాగా గ్రామాలకు పాకుతూ యువత చెడు మార్గంలో వెళ్ళడానికి దోహదపడు తుందన్నారు. దానిని పసికట్టి గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, యువత వివిధ శాఖల ఉద్యోగులు అరికట్టాడానికి పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయాలని కోరారు. తులసి వనంలో గంజాయి మొక్క అన్న చందంగా గ్రామాల్లో ఒక్కరు గంజాయి, డ్రగ్స్ సప్లై చేసిన ఆ గ్రామంలోని యువత చెడు మార్గంలో పయనిస్తారన్నారు.ప్రతి కుటుంబంలో పిల్లలు ఏం చేస్తున్నారని బాధ్యతతో గమనించి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చూడాలని చెప్పారు.గంజాయి రవాణా, విక్రయించే వారిని గుర్తించడానికి గ్రామాలలో గంజాయి నిర్మూలన కోసం గ్రామ కమిటీలు వేసుకోవాలని చెప్పారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు వివిధ సూచనలు చేస్తూ గంజాయిని తమ గ్రామాలలోకి రాకుండా బాధ్యతతో వ్యవహరిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిని రాజశేఖర్, అర్వపల్లి జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్, డీఎస్పీ మోహన్‌కుమార్, ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ డి.శ్రీనివాసరావు, తుంగతుర్తి సీఐ బాలాజీనాయక్, నాగారం సీఐ రాజేష్, ఏఎస్ఐ జగన్మోహన్ రెడ్డి,అర్వపల్లి ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు.