Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని విద్యను అభ్యసించాలని ఎంఈవో బచ్చు లక్ష్మీనారాయణ అన్నారు. మండల కేంద్రంలో శనివారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువు - ఆనందించు - అభివద్ధి చెందు అనే కాన్సెప్టుతో విద్యాశాఖ ప్రారంభించిందని చెప్పారు ,ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నారాయణ ,ఉపాధ్యాయులు దూడల వెంకటేష్, శ్యామసుందరి, శేఖర్, హరినాథ్ రెడ్డి, విజయలక్ష్మి, భవాని, మంద సోమరాజు, సాంబశివ, మురళి, రవి, సత్యనారాయణ, లక్ష్మమ్మ, మీరా, కవిత, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.