Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు నవతెలంగాణ-బొమ్మలరామరం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పేదల కోసం కాదు పెద్దల కోసమే కార్పొరేట్ శక్తుల రాయితీల కోసమేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఆ పార్టీ మండల కమిటీ సమావేశం సండూరు కుమార్ అధ్యక్షతన నిర్వమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పించే విధంగా ఉన్నదని, పేదల మీద భారం పడుతుందని లాభాలతో నడుస్తున్న ఎల్ఐసి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసిందని తెలిపారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ను ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి రేకల శ్రీశైలం. కమిటీ సభ్యులు లక్ష్మయ్య, రమేష్, పున్నమ్మ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.