Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ
భువనగిరి:ఇండిస్టియల్ పార్క్ పేరుతో రైతుల భూములను ప్రభుత్వం తీసుకోవద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీి సభ్యురాలు బట్టుపల్లి అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తుర్కపల్లి భూనిర్వాసితుల సమస్యపైన రైతులతో కలిసి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుర్కపల్లి మండల కేంద్రంలో తాతల కాలం నుండి 72 సర్వే నెంబర్లో రైతులు భూముల పట్టాలు పొంది సాగుచేసుకుంటున్నారన్నారు.ఈ భూము లపై ఆధారపడి 250 కుటుంబాలు జీవిస్తున్నాయ న్నారు. భూములు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వం ఉన్న భూములను తీసుకుంటే పేద రైతుల పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు. ఇతర భూము లలో,ప్రభుత్వ భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం,భూ నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ కసరబోయిన గోపాల్ ,కో కన్వీనర్ పోతరాజు జహంగీర్,ఎండి షరీఫ్,సీపీఎం మండల సీనియర్ నాయకులు కొక్కొండ లింగయ్య,భూములు కోల్పోతున్న నిర్వాసితులు బాలయ్య,బింగి కోమరయ్య,బోయిని బాలయ్య,కసరబోయిన స్వామి,పరమేష్ ,కూరేళ్ళ బాలచారి, కూరేళ్ళ కిరిటి పాల్గొన్నారు.