Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-తుర్కపల్లి
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాల యంలో శనివారం ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నామమా త్రంగా జరిగింది.ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సర్వసభ్య సమావేశానికి 50 శాతం కూడా అధికారులు హాజరు కాకపోవడం పట్ల ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అభివద్ధికి అన్ని విధాలుగా అధికారులు సహకరించాలని కోరారు. మండలంలో ఇప్పటివరకు గొర్ల యూనిట్లు ఎన్ని మంజూరు అయ్యాయని వాటిని నివేదిక కావాలని ఎంపీటీసీలు పశువైద్య అధికారిని అడిగారు .రైతుబంధు వస్తున్నది కానీ రైతు బీమా రావడం లేదని వ్యవసాయ అధికారిని అడిగారు. అంగన్వాడి కేంద్రాల్లో టీచర్లు కాలయాపన చేస్తున్నారని పిల్లలకు ఎలాంటి చదువు నేర్పడం లేదని సర్పంచులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి ,తహసీల్దార్ రవికుమార్ ,ఇన్చార్జి ఎంపీడీవో ఇన్నారెడ్డి, ఎంపీటీసీలు బోరెడ్డి వనజ హనుమంత రెడ్డి, పలుగుల నవీన్ కుమార్ ,కానుగంటి శ్రీనివాస్ యాదవ్, మోహన్ బాబు, కోమటిరెడ్డి సంతోష ,ప్రతిభ రాజేష్, కో ఆప్షన్ రహమత్, సర్పంచులు పడాల వనిత శ్రీనివాస్, పోగుల ఆంజనేయులు, సత్యనారాయణ, ఉమ్మడి మల్లప్ప ,సురేష్ , అధికారులు తదితరులు పాల్గొన్నారు.