Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
ధరణి పెండింగ్లో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన నిర్వహించబడే ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జిట్ట నగేష్, చిట్యాల రూరల్ మండల కార్యదర్శి అరూరి శ్రీను కోరారు. చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిపే ధర్నా కరపత్రాలను శనివారం వెలిమినేడులో వారు పార్టీ మండల నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూములు సేద్యం చేస్తున్న పేద రైతుల పేర్లు కబ్జా కాలంలో లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో తప్పులు దొర్లితే ,యజమాని మరణిస్తే సకాలంలో పౌతి అమలు చేయడం లేదని పేర్కొన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారం కోసం జరిగే ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు కత్తుల లింగస్వామి, ఐతరాజు నర్సింహ, లడే రాములు, మెట్టు నర్సింహ, అరూరి శంభయ్య, పంది నరేష్, అరూరి నర్సింహ, నాతీ వెంకట్రామయ్య, సుర్కంటి బుచ్చిరెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.