Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా ద్వారా విద్యార్థి, యువజన విభాగం ప్రచారంలోకి తీసుకు వెళ్లాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు మామిడాల భానుచందర్ అధ్యక్షతన నిర్వహించిన విద్యార్థి, యువజన మండల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. వాటిని సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియపరిచే విధంగా సోషల్ మీడియా కార్యకర్తలు చురుకుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల యుత్ అధ్యక్షుడు అయిలి కష్ణ గౌడ్,టీఆర్ ఎస్వి. నాయకులు పరిదే సంతోష్,మండల అధికార ప్రతినిధి ఆంజనేయులు, తూర్పుగూడెం సర్పంచ్ వంగల శ్రీశైలం, యువజన విద్యార్థి సోషల్ మీడియా మరియు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,జంగ స్వామి, బాకీ శ్రీను,తమ్మలి ఆశయ్య,బాకీ రాం చందర్,బండ పర్వతాలు,బండ మహేందర్,మటూరు రవి, మల్లేష్, పరుశురాం,రవి,సుధీర్.,జహంగీర్,. సంతోష్,ఎలెందర్,విజరు,తదితరులు పాల్గొన్నారు.