Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
విద్యార్థులు చదవగలిగి నప్పుడే నేర్చుకో కలుగుతారని, అప్పుడే ఉత్తమ వైఖరులు ఏర్పతాయని డీఈఓ కానుగుల నర్సింహ అన్నారు. శనివారం మండలంలోని దత్తాయపల్లి జెడ్పీహెచ్లో రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇది వంద రోజుల కార్యక్రమమని పూర్తయ్యేనాటికి పిల్లలందరూ బాగా చదవాలని కోరారు. విద్యార్థులు గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టాలిలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు ఆయా విషయాలలో 10 నిమిషాల పాటు చదవాలన్నారు.
అనంతరం చిరాక్ పౌండేషన్ వారు 60 వేల విలువైన గ్రంథాలయ పుస్తకాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దత్తాయ పల్లి, తుర్కపల్లి, కేజీబీవీ, ములకలపల్లి, గొల్లగూడెం, పాఠశాలలకు అందజేశారు. అదేవిధంగా రాజపేట మండలం లోని రాజపేట ఉన్నత పాఠశాల, రఘునాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జిల్లా విద్యాశాఖ అధికారి చేతులమీదుగా అందజేశారు .ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కష్ణ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల లక్ష్మి ,.గ్రామ సర్పంచ్ రామ్మోహన్ శర్మ , ఎంపీటీసీ గిద్దె కర్ణాకర్, విద్య కమిటీ చైర్మన్ దుర్గా రెడ్డి. ప్రధానోపాధ్యాయులు రమా నరేందర్ రెడ్డి, ఉపేందర్ రావు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.