Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-నూతనకల్
నిషేదిత పదార్థాలైన గంజాయి ఇతర మత్తుపదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం ఎర్రపహాడ్ ఎక్స్‌రోడ్‌లోని పీఎస్ఆర్ ఫంక్షన్‌హాల్ లో నిర్వహించిన తుంగతుర్తి సర్కిల్పరిధిలోని నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, మండలాల ప్రజా ప్రతి నిధులు, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలకు గంజాయిపై నిర్వహించిన అవగాహానాసదస్సు నుద్దేశించి ఆయన మాట్లాడారు.యువత మత్తు పానీయాలకు, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై తప్పుదోవ పడు తుందన్నారు.వారిని సన్మార్గంలో నడిపించే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.దానికి తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు.అప్పుడే గంజాయిరహిత జిల్లాగా మార్చుకోవచ్చ న్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహన్ కుమార్,సీఐ నాగార్జునగౌడ్, ఎక్సైజ్ సీఐ బాలాజీనాయక్, ఎస్సైలు వై.ప్రసాద్‌గౌడ్, ఆంజనేయులు, ఏఎస్ఐ దస్తగిరి పాల్గొన్నారు.