Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రొడ్డ అంజయ్య అన్నారు. శనివారం పట్టణకేంద్రంలోని రంగారెడ్డి స్మారక భవనంలో నిర్వహించిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేటాయించిన తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిల్చిరన్నారు. పన్నుల రూపంలో ప్రజల నుండి పీడిస్తూ కేంద్రం నుండి రావాల్సిన వాటాలో మాత్రం గుండుసున్న పెట్టారన్నారు. వ్యవసాయం, రైల్వే, ఉపాధిహామీ చట్టంకు నిధుల కోత విధించడం సిగ్గుచేటన్నారు. ఆ పార్టీ మండల కార్యదర్శి గంగదేవి సైదులు మాట్లాడుతూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్నారు. ప్రజాసంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు చీరిక సంజీవరెడ్డి, రాయగిరి కృష్ణయ్య, పల్లె మధుకృష్ణ, శ్రీనివాస్, శ్రీను, శ్రీశైలం, యాదయ్య, శివకుమార్ పాల్గొన్నారు.