Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులను ఆదుకోవాలని, అప్పటివరకు భృతి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొలువులకై ఎదురు చూపులు తప్పడం లేదన్నారు. పాలకులు కొలువులు ఇచ్చింది మూరెడు లేకున్నా చెప్పుకునేది మాత్రం బారెడు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి రెండేళ్లలో 1,07,744 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు భర్తీ చేసింది నిండా 80 వేలు కూడా లేవన్నారు. కొలువురాని యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఒన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓ.టీ.ఆర్) లో 24,82,888 మంది పేర్లు నమోదు చేసుకున్నా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిస్వాల్ కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేది కప్రకారం తెలంగాణలో 1,91,126 ఖాళీలు ఉన్నట్లు తేలిందని, వీటి భర్తీపై ఊసే లేదన్నారు. రెండో దఫా ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి పబ్బం గడుపుకున్నారని అన్నారు. 2019 బడ్జెట్లో రూ.1810 కోట్లు కేటాయించి అట్లానే మురగబెట్టారని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, రాగిరెడ్డి మంగరెడ్డి, హాయుబ్ ఖాన్, రొండీ శ్రీను, వినోద్ నాయక్, వన్ టౌన్, టూ టౌన్ కార్యదర్శులు మల్లు గౌతమ రెడ్డి, బావాండ్ల పాండు, నాయకులు కొర్ర శంకర్, బాబునాయక్, అంకెపాక సైదులు, కోటేశ్ పాల్గొన్నారు.