Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దళితబంధుకు పైలెట్ ప్రాజెక్టుగా గుడిబండ గ్రామం
అ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
సీఎం కేసీఆర్ వచ్చాకానీ ప్రజలకు రాజ్యంగఫలాలు అందుతున్నాయని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.శనివారం అనంతగిరి మండలంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠమహోత్సవానికి, పట్టణ పరిధిలోని బోటిగుట్టపై నిర్మిస్తున్న లింగమంతుల దేవాలయాన్ని దర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. పేద వర్గాలకు న్యాయం జరుగుతుందంటే అంబేద్కర్ కషి వల్లనేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి బీజేపీ, కాంగ్రెస్‌లు శక్తికి మించిన విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.దళిత బంధుకు పైలెట్ ప్రాజెక్టు గ్రామంగా మండల పరిధిలోని గుడిబండ గ్రామాన్ని ఎన్నిక చేశామన్నారు.అంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా కోదాడకు రావడంతో నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీపీలు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సణ్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,నాయకులు పాయలి కోటేశ్వరరావు, వంశీ, అబిధర్, అప్పారావు, పీఏసీఎస్ చైర్మెన్లు రమేష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.