Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.శనివారం హుజూర్ నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలు, ఎంపీలను కొనుగోలు చేసి అప్రజాస్వామికంగా ముందుకు వెళుతూ పాలన చేస్తూ తాము బలపడ్డామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన కోర్టులు ,న్యాయవ్యవస్థ, మీడియా తదితర రంగాలను కూడా అవహేళన చేస్తూ ముందుకు వెళ్తు తనకు అనుకూలంగా లేని వారిపై వారిపై కక్ష సాధిస్తూ రాజ్యాంగం ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య విలువలపై ముఖ్యమంత్రి అయి రూ.వేలకోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నార ని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ,బీజేపీలు ఒకరినొకరు తిట్టుకున్నట్లుగా డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ సందర్భంగా తాను పార్లమెంటు పరిధిలో వివిధ రోడ్ల అభివద్ధికి మంజూరైన నిధుల వివరాలను వెల్లడించారు.ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఈడ్పుగంటి సుబ్బారావు, కాంగ్రెస్ మైనార్టీ జిల్లా సెల్ చైర్మెన్ ఎండి .నిజాముద్దీన్, నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు,కష్టాల శ్రావణ్‌కుమార్, భూక్యా మంజునాయక్ పాల్గొన్నారు.