Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు. మోత్కూర్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడకంపై అవగాహనలో భాగంగా శనివారం మోత్కూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎంపీపీ కల్పన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వాడకంతో జరిగే అనర్థాలను యువతకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మెన్ కంచర్ల అశోక్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ, సర్పంచులు రాంపాక నాగయ్య, అండెం రజితరాజిరెడ్డి, ఉప్పల లక్ష్మీ యాదయ్య, దండెబోయిన మల్లేష్, మరిపెల్లి యాదయ్య, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, తహసీల్దార్ షేక్ అహ్మద్, వెటర్నరీ ఏడీ మోతీలాల్, డాక్టర్ వల్లాల సంతోష్, సీడీపీవో జ్యోత్స్న, సూపర్వైజర్ మంగమ్మ, ఎక్సైజ్ ఎస్ఐ రాంబాబు, పీఆర్ ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.