Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని కృష్ణారీలింగ్, ట్విస్టింగ్ కంపెనీని శనివారం కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. కంపెనీలో తయారు చేసే పట్టుదారం, సిల్కు, మలబరీ కాయల నుండి దారం ఎలా తీస్తారు... ఏవిధంగా ట్విస్ట్ చేస్తారు అని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో పనిచేస్తున్న 80మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ యజమాని గంజి అరుణశ్రీహరిని అభినందించారు. ఆమె వెంట ఆర్డీఓ సూరజ్‌కుమార్, జిల్లా అధికారి అన్నపూర్ణ ఉన్నారు.