Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-అనంతగిరి
తమ ప్రభుత్వహయాంలోనే ప్రాచుర్యం కోల్పోయి శిథిలావస్థలో ఉన్న దేవాలయాలకు రూ. వేల కోట్ల బడ్జెట్ కేటాయించి పూర్వవైభవం తెచ్చామని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి,రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగులలింగయ్యయాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శనివారం మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వారు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు.యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహాస్వామి స్వామి ఆలయం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నేడు దేశంలోనే ఒక చారిత్రాత్మక కట్టడంగా నిలిపారని గుర్తుచేశారు.గత పాలకులు చారిత్రాత్మక ఆలయాలను విస్మరించిన ఫలితంగా ఎంతో చరిత్ర ఉన్న దేవాలయాలు శిథిలావస్థకు చేరాయన్నారు. ఆలయాల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి పేదవాడు సంతోషంగా పండుగ జరుపుకునే విధంగా ప్రభుత్వం సహాయం చేస్తూ నేడు దేశంలోని ఆదర్శంగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ బుర్ర సుధారాణి, మున్సిపల్ చైర్మెన్ శిరీష లక్ష్మీనారాయణ,ఎంపీపీలు కవితరెడ్డి, చుండూరి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ ఉమా, సర్పంచ్ వేనేపల్లి వెంకటయ్య, నాయకులు వాసుదేవరావు, ఈదుల కష్ణయ్య,వెంపటి వెంకటేశ్వరరావు, మట్టపల్లి శ్రీనివాస్, వీరయ్య,గోళ్ళ వీరబాబు, చార్లెస్, పుల్లయ్య గౌడ్, పుల్లారావు పాల్గొన్నారు.