Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-నూతనకల్
: నేతి చంద్రయ్య మతి సీపీఐ(ఎం)కు తీరనిలోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని వెంకేపల్లిలో ఇటీవల అనారోగ్యంతో మతి చెందిన పార్టీ సీనియర్ నాయకులు నేతి చంద్రయ్య సంతాపసభ నిర్వహించారు.నాగార్జునరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మతుని చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ గ్రామంలో పార్టీని బలోపేతం చేయడంలో నేతి చంద్రయ్య చేసిన కషి మరువలేనిదన్నారు.భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడిగా పనిచేస్తూ మండలంలో అనేక గ్రామాలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు.ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తట్టుకొని పార్టీని అగ్రభాగంలో నడపడంలో ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదన్నారు.ఆయన్ను ఆదర్శంగా తీసుకొని యువత ప్రజాసమస్యలపై పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టియాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్‌రెడ్డి, బుర్ర శ్రీనివాస్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపెల్లి సైదులు,సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, మండలకమిటీ సభ్యులు బత్తుల జనార్దన్‌గౌడ్, సీఐటీయూ మండల కార్యదర్శి బొజ్జ శ్రీను, నాయకులు గజ్జల శ్రీనివాస్‌రెడ్డి,పోలేపాక నగేష్,గ్రామ పార్టీ సభ్యులు దూది గాని వెంకటయ్య,లింగయ్య, బాతుకపెద్ద లింగయ్య, చంద్రయ్య, మేకల కాశయ్య పాల్గొన్నారు.