Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
పోరాటాల ద్వారానే కార్మికులు హక్కులు సాధించుకోవచ్చని,గడిచిన 20 ఏండ్ల కాలంలో ఎన్నో పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నామని తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకష్ణ అన్నారు.శనివారం హుజూర్‌నగర్‌లోని అమరవీరుల స్మారకభవనంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వం చేప పిల్లల పేరుతో విడుదల చేస్తున్న రూ.వందల కోట్లు అడ్డదారుల్లో అవినీతి పాలవుతున్నాయని విమర్శి ంచారు.ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల నిజమైన మత్స్యకారులు నష్టపోతున్నారని ,వారి వద్ద రూ.50 నుండి రూ.60కి చేపలు కొనుగోలు చేస్తున్న దళారులకు మాత్రం రూ.100 నుండి రూ.150కి పైగా అమ్ముకొని లాభ పడుతున్నారన్నారు.ప్రభుత్వం దళారుల చేతిలోకి చేప పిల్లలను ఇవ్వకుండా సొసైటీలకే కావాల్సిన డబ్బును వారి అకౌంట్లో వేస్తే పిల్లలు కొనుగోలు చేసుకొని చెరువులలో పెంచుకుంటారన్నారు.మత్స్యకారులకు సంక్షేమపథకాలు అమలు చేసే విషయంలోనూ అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసేది తమ సంఘమేనన్నారు. క్షేత్రస్థాయిలో సంఘం బలోపేతానికి అందరూ కషి చేయాలని పిలుపునిచ్చారు.సంఘం నాయకులు శీలం శ్రీను అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు మురారి మోహన్, నాగేశ్వరావు, మేకనబోయిన శేఖర్, మామిడి నాగ సైదులు, పోసణబోయిన హుస్సేన్, నల్లమేకల అంజయ్య, ప్రజా సంఘాల నాయకులు నాగారపు పాండు, పల్లె వెంకట్‌రెడ్డి,భూక్యా పాండునాయక్, వట్టెపు సైదులు, పిట్టల నాగేశ్వరరావు, శ్రీలం వెంకన్న, సాంబయ్య, చింతకాయల పర్వతాలు, కాసాని వీరస్వామి, నర్సింహారావు,మట్టయ్య, కష్ణ,ధనమూర్తి, ఎస్డి.హుస్సేన్ పాల్గొన్నారు.