Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
భారత రాజ్యాంగం పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు లంకపల్లి నగేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా కో ఆర్డినేటర్ బకరం శ్రీనివాస్ మాదిగలు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని అర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందనే కనీస అవగాహన లేకుండా కేసీఆర్ మాట్లాడడం అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని తెలిపారు. ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే దేశ ప్రజలకు, అంబేద్కర్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాన్ని ఇంకా ఉదతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు రమణ భార్గవ్, గట్టు మల్లన్న, జిల్లా నాయకులు అరేకంటి వెంకన్న, పండు గోపాల్, తీగల మల్లికార్జున్, శ్రీపతి యాదగిరి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు కత్తుల మల్లేశం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు అద్దంకి దేవదాసు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మేడి రామకృష్ణ, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకులు, టీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ యాదగిరి, పట్టేటి జానయ్య, కత్తుల రవీందర్, కత్తుల యాదయ్య , యూటీఎఫ్ నాయకులు శ్యామ్ , ఎరుకల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల అంజయ్య , బొజ్జ దేవయ్య , కత్తుల సన్నీ , మాతంగి నవీన్, గడ్డపాటి లక్ష్మణ్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.