Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహాజరుకాని అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-వేములపల్లి
మండలంలోని సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసే సర్వసభ్య సమావేశం అధికారులు నిర్లక్ష్యంతో నీరు గారిపోతుంది. పూర్తిస్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో సమస్యలు సభలో సమీక్షకు రావడం లేదు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం అధికారులు ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో వెలవెలపోయింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హాజరయ్యారు. పూర్తి స్థాయిలో అధికారులు రాకపోవడంతో సమావేశం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అధికారులు వచ్చేవరకూ ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయంలో గంటన్నర వేచి చూశారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. సమావేశంలో అధికారుల గైర్హాజరుపై ఎమ్మెల్యే మండిపడ్డాడు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి మండలంలోని గ్రామాల సమస్యలపై సమీక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి రాని అధికారులపై జిల్లా పరిషత్‌కి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో జరిగే సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో మండల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. సమావేశంలో 13 గ్రామ పంచాయతీలకు గాను నలుగురు సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. అధికారులు ఎవరూ కూడా హాజరు కాలేదు. కొందరు గైర్హాజరు కాగా, మరికొందరు అసిస్టెంట్ లు హాజరయ్యారు. మండల విద్యాధికారి, విద్యుత్ శాఖ ఏఈ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, తహసీల్దార్, పశు వైద్యులు, ఐబీ అధికారి, ఎఘడీఓ తమ సీట్లను సభకు పంపించారు. ఫారెస్ట్ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, ఆర్అండ్బీ, వెలుగు, పీఏసీఎస్, సూపరిన్డ్ంట్, ఈజీఎస్అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గైర్హాజరయ్యారు. దీంతో సమస్యలపై సమీక్షించడానికి ప్రజా ప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారులు అందరూ హాజరైతేనే సమావేశం నిర్వహించాలని ఎంపీపీ పుట్టాల సునీత కృపయ్య, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన్, శశిధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ దేవిక , డిప్యూటీ ఎమ్మార్వో నిర్మల, ఇన్చార్జి ఇఓఆర్డి శ్రవణ్ కుమార్, సర్పంచులు అంకెపాక రాజు, దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, మజ్జిగ పద్మ సుధాకర్ రెడ్డి, సైదులు, కృష్ణవేణి, ఎంపీటీసీలు శ్రీరామ్ రెడ్డి, లలిత, చైతన్య, వీరయ్య, గడ్డం రాములమ్మ, హాజరయ్యారు.