Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మండలపరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం తూతూమంత్రంగా సాగింది.ఎంపీపీ గుడ్ల ఉపేంద్రవెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులు సమావేశానికి రాకపోవడంతో ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తు న్నారని, గ్రామాల్లో జరిగే పనులు,సమస్యలు ఎవరికి చెప్పుకోవా లన్నారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుందూరు విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని గుమ్మడవెల్లి, కుక్కడం,కుంటపల్లి గ్రామాలకు శ్రీరాంసాగర్ జలాలు నేటివరకు రావడం లేదనిగత సమావేశంలో ఎస్సారెస్పీ నీటిపారుదల శాఖ అధికారులకు తెలియజేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.నేటి సమావేశానికి హాజరుకాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు రానప్పుడు సమావేశం నిర్వహించడం ఎందుకని ఎంపీడీఓ సరోజను ప్రశ్నించారు.ఈ సమావేశంలో వైస్‌ఎంపీపీ శ్రీరాంరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ బాలరాజు, ఎంపీఓ రాజేష్, పలు గ్రామాలసర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.