Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 317ను వెంటనే సవరించాలని కోరుతూ ఈ నెల 9న హైదరాబాద్ ఇందిరాపార్కులో ఉపాధ్యాయ సంఘాలపోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య పిలుపునిచ్చారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన యూఎస్పీసీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో నేడు 317 జీవో వివాదాస్పదంగా మారిందని,ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభ్యర్థనలను, అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతుందని విమర్శించారు.ఈ కేటాయింపుల వల్ల పలువురు ఉద్యోగులు స్థానికతను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సీనియారిటీ జాబితాను సమగ్రంగా చేయలేదని, స్పెషల్ కేటగిరి అభ్యర్థులను సమగ్రంగా పరిశీలించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.భార్యాభర్తలను ఒకే లోకల్ క్యాడర్ లో బదిలీ చేయాల్సి ఉండగా కొందరికి మాత్రమే ఈ అవకాశం దక్కిందన్నారు.ఉద్యోగులు, ఉపా ధ్యాయులు తమ అభ్యర్థులను, అసంతృప్తులను తెలియ పరచడం కోసం వివిధ రూపాల్లో భాగంగా ఈనెల 9న సీఎం దష్టికి తీసుకెళ్లేందుకే మహాధర్నా నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో యూపీఎస్సీ జిల్లా నాయకులు ఎస్.అనిల్ కుమార్, ఆర్.లింగయ్య, పి.శ్రీనివాస్,బి. వెంకటేశ్వరరావు, జి.ఆనంద భాస్కర్, సిహెచ్.వీరారెడ్డి, ఆర్.సీతయ్య, ఎన్.నర్సింహారావు, ఆర్.శీనయ్య, వీరారెడ్డి, ఎల్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.