Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
ఆరే కుల సంక్షేమసంఘానికి హైదరాబాద్ ఉప్పల్ భాగాయత్‌లో ఆత్మగౌరవ భవనానికి ఎకరం స్థలం, కోటి రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ఆరే కుల సంక్షేమసంఘం తిరుమలగిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు సంఘ భవన నిర్మాణ కమిటీ సభ్యులు బనువరి నర్సయ్య మాట్లాడుతూ స్థలం, నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు, కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు చెట్టిపల్లి శివాజీ, రాష్ట్ర రుణ విమోచన చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లుకు ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మాసంపల్లి మోహన్ మాట్లాడుతూ ఆరే కులఆరాధ్యుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 19న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగులగాని లక్ష్మయ్య, చిన్నూరి వెంకటేశ్వర్లు, డునుకునాలనర్సింహాస్వామి, మాసంపల్లి మాధవి, సావాని సోమేశ్, ఉపేందర్, భూతాల శంకర్, దుర్గయ్య, రాంబాబు,మల్లయ్య, నర్సింగరావు, భాషపల్లి రతన్ పాల్గొన్నారు.