Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ఆలేరురూరల్
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి రూ.2 లక్షల బీమా, ఎల్ఐసీ సదుపాయం కల్పిస్తామని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు.ఆదివారం మండలంలోని కొల్లూరు గ్రామంలో ఆయన మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ 20000 మంది డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేందుకు కార్యకర్తలు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.అది బూత్‌లో 200 మందితో సభ్యత్వ నమోదు చేయాలని తెలిపారు .సభ్యత్వం చేసిన వ్యక్తులకు ఆన్లైన్ ద్వారా ఓటీపీ ఉందన్నారు.రైతుల పట్ల ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మేలు జరిగిందన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.