Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
హాలియా : గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్కు పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతనం 19వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ అనుముల మండల జనరల్ బాడీ సమావేశం జి.సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, పార్ట్ టైం, ఫుల్ టైం, ఆశ అంగన్వాడీ ఉద్యోగులందరికీ పీఆర్సీ వర్తింపజేసి వేతనాలు పెంచాలని కోరారు. గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులలో 90శాతానికి పైగా దళిత గిరిజన బడుగు వర్గాలకు చెందిన వారు ఉన్నారని, వీరి పట్ల వివక్ష ప్రదర్శించడం సరికాదని అన్నారు. దళిత ఎంపవర్మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా జీపీ కార్మికులకు నిర్మాణ, నిర్ణయాత్మక ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల కార్మికులు మరో పోరాటానికి సిద్ధం అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు పొదిల వెంకన్న, యూనియన్ నాయకులు జి.సుధాకర్, ఎం.రమేష్ , సాగర్, శంకరాచారి, శంకర్, ఎస్.శివ, భాగ్యమ్మ, కె.సైదులు, ఆర్.రమేష్ పాల్గొన్నారు.