Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
నవతెలంగాణ-చౌటుప్పల్
క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.ఆదివారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బూర లక్ష్మయ్య-రాజమ్మ(బీఎల్ఆర్) ఫౌండేషన్ అండ్ నంద యువసేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లను టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలోని ముస్కు మధుసూదన్‌రెడ్డి ఫిజికల్ వ్యాయామ కళాశాలలో ఈ నెల 12న క్రికెట్ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సింగిల్‌విండో, మార్కెట్ చైర్మెన్లువెన్రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, నాయకులు గిరికటి నిరంజన్‌గౌడ్, పెద్దిటి బుచ్చిరెడ్డి, ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ఉడుగు శ్రీనివాస్‌గౌడ్, తొర్పునూరి నర్సింహాగౌడ్, ఉష్కాగుల నాగరాజుగౌడ్, కంది లక్ష్మారెడ్డి, ఎమ్‌డి.బాబాషరీఫ్, తాడూరి పరమేశ్, ఎస్కె.మున్న, చింతకింది మురళి పాల్గొన్నారు.